రాత్రి పూట పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీళ్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కొంతమంది రాత్రిపూట భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వేడి నీళ్లు తాగితే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. వేడి నీళ్లు శరీరంలోని నాడీ వ్యవస్థను కూడా రిలాక్స్ చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.