»Abortion Of A Student In The College Room The Young Woman Died
Nellore:కాలేజీ గదిలో విద్యార్థినికి అబార్షన్.. యువతి మృతి
ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nellore : నెల్లూరులో ఓ దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్(Abortion) తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు…నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన ఓ 19 ఏళ్ల విద్యార్థిని ఈనెల 11న స్టూడెంట్స్(Students) అందరూ కాలేజీ(College) ఆవరణలో ఉన్నారు. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కతే క్లాసు రూంలో ఉండి తలుపులు ఘడియ పెట్టుకుంది. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో స్నేహితులు గది తలుపులు పగలగొట్టారు. అక్కడ.. క్లాస్ రూమ్(Class room) లో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడిలో విద్యార్థిని పడిపోయి ఉంది. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమె పక్కన ఆరు నెలల పిండం ఉంది.
కాలేజీ సిబ్బంది సహకారంతో విద్యార్థులు వెంటనే ఆ యువతిని, పిండాన్ని పక్కనే ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. యువతి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఈ మేరకు సమాచారం అందడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి తండ్రి(Father) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. క్లాస్ రూమ్ లో అబార్షన్ అయ్యిందా ? ఆమె యూట్యూబ్లో చూసి ఏమైనా తానే కావాలని అబార్షన్ చేసుకుందా? క్లాస్ రూంలో ఎందుకు ఇలా చేసింది? తల్లిదండ్రులకు ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలుసా? అనే కోణంలో పోలీసులు(Police) ఆరా తీస్తున్నారు. యువతి సెల్ ఫోను ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దీంట్లో అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవర్(Car driver) తో ఆమెకు పరిచయం ఉన్నట్లు వెలుగు చూసింది. క్షేత్రస్థాయిలో దీనిమీద విచారణ కొనసాగిస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.