AP: అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా ఇబ్బందులు తలెత్తాయని.. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్‌కు వైద్యులు తెలిపారు.