AP: YCP హయాం నాటి TTD పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను CID.. హైకోర్టుకు సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై TTD ఈవో, అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న EOను కోర్టులో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో రూ.20వేల జరిమానా చెల్లించాలని తెలిపింది.