బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి బ్లడ్ ప్రెజర్ పెరగడం కూడా ప్రధాన కారణం. ఆడవారి కంటే మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కాగా, బీపీని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హై కొలెస్ట్రాల్ ఫుడ్స్, చీజ్, బర్గర్స్, ఐస్ క్రీమ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే, ఉప్పు ఎక్కువగా తినొద్దు. తాజా పండ్లు, వారానికి రెండుసార్లు చేపలు తినాలి. ప్రతిరోజూ 30 నిమిషాలు వర్కౌట్స్ చేయాలి.