భారత్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశమని కొనియాడారు. ఇండియాతో తమ సంబంధాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని ప్రశంసించారు. ఏడాదికి 7.4 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తోందని వ్యాఖ్యానించారు.