»A Husband Who Gave A Few Sacks Of Cash To His Wife As Alimony
Maintenance To Wife : భార్యకు భరణంగా బస్తాల కొద్ది చిల్లర ఇచ్చిన భర్త
తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.
Maintenance To Wife : పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య గొడవలు సహజం. ఈ మధ్య కాలంలో చిన్న విషయాలకే భార్యభర్తలు విడిపోతున్నారు. నచ్చజెప్పాల్సిన తల్లిదండ్రులు(Parents) కూడా వారికే ఒత్తాసు పలుకుతున్నారు. దీంతో కోర్టు(Court)కెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన జంటకు న్యాయమూర్తి(Judge) జంటకు విడాకులు మంజూరు చేశారు. అందుకు ప్రతిగా తన భార్యకు నెలవారీగా భరణాన్ని ఇవ్వాలని ఆదేశించాడు. ఆ తర్వాతే అసలు ట్విస్టు చోటు చేసుకుంది.
కిడయూరి మెట్టూరికి చెందిన రాజీ, శాంతి దంపతులు. వీరి మధ్య గొడవలు కారణంగా వారిద్దరు దూరంగా ఉంటున్నారు. తన భర్త నుంచి భరణం(Maintenance) చెల్లించాలని శాంతి కోర్టు మెట్లు ఎక్కింది. సంగగిరి 2వ క్రిమినల్ కోర్టలో కేసు వేయగా..ఆమెకు ప్రతినెలా రూ. 73000 జీవనభృతిగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అతడు భరణాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్(Petition)ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని రూ.2.18 లక్షలు వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు. దీంతో రాజీ న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా భరణం ఇచ్చేందుకు అంగీకరించాడు.
తనకు ఇష్టం లేకున్నా.. కోర్టు ఇవ్వమన్న రూ.2.18 లక్షల మొత్తాన్ని పది రూపాయిల కాయిన్(10Rupee Coins) మూటల్ని కోర్టుకు తీసుకొచ్చాడు. మొత్తం పదకొండు బస్తాలతో తీసుకొచ్చిన భరణం డబ్బుల్ని చూసిన కోర్టు సిబ్బంది సైతం అవాక్కు అయ్యారు. జడ్జి సమక్షంలో ఆ బ్యాగ్ ను భార్య ముందు పెట్టి లెక్కపెట్టుకోమన్నాడు. భర్త తీరుపై భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంత సొమ్మును లెక్కించేందుకు కోర్టు సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు. భరణం కచ్చితంగా నోట్ల(Notes) రూపంలోనే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని అతడు వాదిస్తున్నాడు.