AP: YCP నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ వస్తున్నారు.. ఎక్కువ మంది రావాలంటూ.. వారి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టుకున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే YCP నాయకులు హెలిప్యాడ్‌పై దాడి చేశారని విమర్శించారు. ఈ క్రమంలో పోలీసులకూ గాయాలయ్యాయన్నారు. ఓ క్రిమినల్ పాలిటిక్స్‌లో ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ అని మండిపడ్డారు.