ఎలాంటి షరతులు లేకుండా మొత్తం పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా తిమ్మాపురంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మద్దతు ధర ఇచ్చి పత్తి కొనుగోలు చేసే బాధ్యత సీసీఐదేనని పేర్కొన్నారు. పత్తి కొనుగోలులో కేంద్రంపై, సీసీఐపై తెచ్చిన ఒత్తిడి ఫలిందని తెలిపారు.