AP: KGBVలో సీటు రాకపోవడంతో కూలీ పనికి వెళ్తున్న బాలికకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు. ‘బాలిక పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకుని సీటు వస్తుంది.. నిశ్చింతంగా చదుకోవాలి. పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గడం బాధాకరం. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను కోరుతన్నా. పిల్లల భద్రత-భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు’ అని అన్నారు.