భారత్-భూటాన్ దేశాల మధ్య ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టును ఏర్పాటు చేశారు. అస్సాంలోని దర్రంగా వద్ద ఈ చెక్పోస్ట్ పెట్టారు. దీన్ని భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్గే, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చెక్పోస్టుతో ఇరుదేశాల మధ్య రాకపోకలతో పాటు వ్యాపార, వాణిజ్యం, సేవా కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.