రోజుకూ కనీసం 5 పుట్టగొడుగులను తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఉదయం కోడిగుడ్డు ఆమ్లేట్ లేదా ఉప్మాలో కలిపి వీటిని తింటే మంచిదని సూచిస్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.