TG: హైదరాబాద్లో భారీగా నిషేధిత చైనా మాంజాను అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుంది. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో పట్టుకున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. దీంతో వాహనాలపై ప్రయాణిస్తుండగా చుట్టుకొని తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.