జమిలి ఎన్నికల బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల విధానంపై కాంగ్రెస్ పార్టీ ఏడాది నుంచి ఒకే మాట మీద ఉందని.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉందని వెల్లడించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు.. జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపాలని కోరారు.