కొంతమందిలో ఉన్నట్లుండి తలతిరగడం జరుగుతుంది. ముఖ్యంగా లేచి నిలబడిన వెంటనే లేదా కూర్చున్నప్పుడు సడన్గా కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు ఇలా జరుగుతుంది. గుండెకు రక్త ప్రసరణ తగ్గి.. హార్మోన్ ప్రతిస్పందనలు సరిగా ఉండవు. దాని వల్ల ఇలా జరగొచ్చు. అనారోగ్య సమస్యల వల్ల సుదీర్ఘంగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడూ శరీరానికి రక్తం సప్లై సరిగా ఉండదు. అందువల్ల శరీరం తూలినట్లు అనిపిస్తుంది.