ప్రతి పది నిమిషాలకు ఓ మహిళ భాగస్వామి లేదా బంధువుల చేతిలో హతమవుతుందని యూఎన్ఓ వెల్లడించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 85 వేలమంది మహిళలు, బాలికలు హత్యకు గురైనట్లు యూఎన్ఓ సంస్థల నివేదికలో తేలింది. వారిలో 51 వేలమందికిపైగా తమ భాగస్వామి లేదా బంధువుల చేతిలో బలైనట్లు పేర్కొన్నారు. ప్రాణాలకు ముప్పు విషయంలో మహిళలు, బాలికలకు ఇల్లే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ఉందని రిపోర్టులో వెల్లడయింది.