TG: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి KCR అన్యాయం చేశారని, అప్పుడే KCRను కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి KCR మెడలు వంచింది BJPనే అని గుర్తుచేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, PRLI ప్రాజెక్టును విభజన చట్టంలో ఎందుకు పొందుపరచలేదని పేర్కొన్నారు.