TG: మాజీమంత్రి KTRపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను స్పీకర్ని.. ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. BRS ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావటానికి BRS కూడా మద్దతిచ్చింది. అసెంబ్లీలో సీనియర్ సభ్యుడైన KTR.. నాపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం వినియోగించుకోవటం లేదు’ అని అన్నారు.