AP: అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం పెనుగొల్లులో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన వారికి ఉదయం నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేసి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెల ఒకటోవ తేదీనే పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.