కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తే తాను సీఎంగా కొనసాగుతానని, నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని తెలిపారు. తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇద్దరు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.