TG: పక్కరాష్ట్రాలతో తమకు వివాదాలు వద్దని.. నీళ్ల విషయంలో కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మాట చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే మాట చెప్పారు. తమకు కూడా వివాదాలు వద్దని.. సయోధ్య కోరుకుంటున్నామని అన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలు సహకరించుకుని అభివృద్ధి సాధించాలని నెటిజన్లు అంటున్నారు. మీరేమంటారు..?