ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి హత్య బెదిరింపులు రావడంతో దేశాన్ని వీడినట్లు తెలిపారు. న్యాయపరమైన చిక్కుల కారణంగా తాను భారత్‌ను వీడలేదని చెప్పారు. ఇక్కడి ఏ కోర్టులోనూ తనపై ఒక్క కేసు కూడా లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఇక భారత్‌కు ఎప్పుడైనా తిరిగొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, 2010లో దేశం వీడిన లలిత్ మోదీ.. లండన్‌లో నివాసం ఉంటున్నారు.