ఖలిస్థానీలకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా భారత్తో వ్యవహరిస్తున్న తీరుతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో ఖలిస్థానీల ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని అంగీకరించారు. అయితే వాళ్లంతా సిక్కు సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదన్నారు.