బీట్రూట్ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడటంలో ఈ ఆకులు సహాయపడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మానికి తేమను అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.