ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలను.. ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని.. ఏప్రిల్ 10న విడుదల అవుతుందంటూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.