AP: అదానీతో విద్యుత్ ఒప్పందంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున లాయర్ ఆదినారాయణ రావు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని, విచారణను వాయిదా వేయాలని AAG శ్రీనివాస్ కోరారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. కాగా, గత విద్యుత్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ TDP నేత పయ్యావుల కేశవ్, CPI నేత కె.రామకృష్ణ పిటిషన్ వేశారు.