ప్రాణాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.