NRPT: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పక్కకు పెట్టింది నువ్వు కాదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం కోడంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మా ప్రాంత ప్రజలు చక్కటి బట్టలు కట్టడం చూడలేవా అని ప్రశ్నించారు. 69 జీవో గురించి ఈ ప్రాంత ప్రజలు ఎన్నో పోరాటాలు చేయలేదా అని ప్రశ్నించారు.