TG: శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. నదీ జలాలపై మీడియా సమావేశాల్లో ఊదరగొట్టిన ఆ రెండు పార్టీలు అసెంబ్లీలో మాత్రం సరైన చర్చ జరపలేదని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.