చాలా మంది ఇళ్లలో, ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుంటారు. ఇలా ఎక్కువసేపు కూర్చోడం వల్ల జీవితం కాలం తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె సమస్యలు వస్తాయని, ఇలా కూర్చునే వారిలో మెదడు, కాలేయం, కిడ్నీలపైనా ప్రభావం పడి.. వాటి పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు. స్థూలకాయం బారిన పడే ఛాన్స్ ఉంది. మెడ నొప్పి, వెన్నునొప్పి వస్తుంది. గంటల తరబడి కూర్చోడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి.. రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది.