ప్రధాని మోదీ చైనా పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. యుద్ధంలో పాక్కు చైనా సహకారంపై మోదీ మౌనంగా ఉండడం దేశ వ్యతిరేకమే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. ఉగ్రవాదంపై చైనా ద్వంద్వ ప్రమణాలు పాటిస్తోందని ధ్వజమెత్తారు. భారత్, చైనా ఉగ్రవాద బాధిత దేశాలనడం సరికాదన్నారు. చైనా ముందు భారత్ లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.