TG: ‘మీ సేవ’ ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించడం లేదని.. దరఖాస్తులు తీసుకోవాలని పేర్కొంటూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయిస్తున్నామని.. దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరినట్లు పేర్కొంది.