ASR: గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల వల్ల ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగి, శాంతి నెలకొంటుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో శనివారం నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ రేగం రమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ట చేశారు.