ASR: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పాడేరులో ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్-2 వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని తెలిపారు.