ASR: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టీడీపీ కొయ్యూరు మండల కార్యదర్శి దొరబాబు అన్నారు. శనివారం ఆయన కన్నవరం గ్రామంలో పర్యటించారు. కన్నవరం నుంచి వంతమర్రి, పిట్టలపాడు, గరిమండ వరకూ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే మారుమూల గ్రామాలకు రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు.