భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే వరకు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. కాగా వాషింగ్టన్ సుందర్ మరోసారి సత్తా చాటి 4 వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 156 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.