బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కార్యకర్తలే మా పార్టీకి వెన్నెముక. వారి శక్తి, ఉత్సాహం ప్రేరణదాయకం. కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసినవారి సేవలు మరువలేనివి. బీజేపీ సుపరిపాలన అజెండాను దేశప్రజలంతా చూస్తున్నారు’ అని తెలిపారు.