అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 30 కింద మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయని తెలిపింది. కాగా, 1875లో స్థాపించబడిన అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం.. అలీఘర్ వర్శిటీకి మైనార్టీ హోదా సాధ్యం కాదని ఇచ్చిన 1967 నాటి తీర్పును తోసిపుచ్చింది.