TG: సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని మాజీమంత్రి కేటీఆర్ పరామర్శించారు. చేనేత కార్మిక దంపతుల ముగ్గురు పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటానని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంత వరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు. అమర్-స్రవంతి దంపతుల ముగ్గురి పిల్లల చదువు బాధ్యత తనదేనని, చెరో 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు.