J&Kలో నిర్వహించిన తొలి మారథాన్‌ను CM ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. అనంతరం మారథాన్‌లో పాల్గొని 2 గంటల్లో 21 కి.మీలు పరిగెత్తారు. 13 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 2 వేల మంది అథ్లెట్లతో కలిసి ఆయన పరుగు కొనసాగించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక, శిక్షణ లేకుండా తాను ఈ ఈవెంట్లో పాల్గొన్నట్లు ఎక్స్‌లో తెలిపారు. భవిష్యత్తులో కశ్మీర్ మారథాన్ ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి వెళ్తుందని పేర్కొన్నారు.