AP: సోషల్ మీడియాలో వైసీపీ సైతాన్ సైన్యాన్ని ఏర్పరుచుకుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైసీపీ సోషల్ సైకోల దాడిలో తానూ బాధితురాలినేనని పేర్కొన్నారు. సొంత చెల్లి, తల్లిపైనే.. జగన్ అసభ్యకర పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. మాపై అభాండాలు వేస్తున్నా.. జగన్ నోరు విప్పలేదని, సోషల్ సైకోలను అరెస్టు చేయడం శుభపరిణామం అని అన్నారు. వీటి వెనుక ఉన్న అసలైన అనకొండలను పట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.