AP: మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన శాసనసభ ఎథిక్స్ కమిటీ భేటీ అయ్యింది. అసెంబ్లీకి రాకుండా వైసీపీ సభ్యులు TA, DAలు క్లెయిమ్ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. ఈ నిబంధన పెట్టడం దేశ చరిత్రలో తొలిసారి అని బుద్ధ ప్రసాద్ అన్నారు. ఈ సమావేశంలో జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.