AP: లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోఖ్రా నుంచి కీలక సమాచారం రాబట్టింది. మనీ లాండరింగ్ కేసుల్లో అనిల్‌కు పాత నేర చరిత్ర ఉంది. డొల్ల కంపెనీలు సృష్టించి నల్లధనాన్ని చలామణీ చేయడంలో సిద్ధహస్తుడని గుర్తించింది. దీంతో సిట్ అధికారులు అనిల్‌ను 49వ నిందితుడిగా చేర్చారు. త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది.