చాలా మంది బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లు, కష్టమైన వ్యాయామాలు చేస్తుంటారు. కానీ, తేలికగా 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్ చేయడం వల్ల హృదయ కండరాలు, ఊపిరితిత్తులు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో క్యాలరీలు బర్న్ అయ్యి.. భుజాలు, పొట్ట, కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. నిత్యం స్కిప్పింగ్ చేస్తే గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు.