అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఇవాళ దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. భారతీయ అమెరికన్లతో కలిసి అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. శ్వేతసౌధంలోని బ్లూ రూమ్‌లో బైడెన్ దీపం వెలిగిస్తారని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ వేడుకలకు హాజరైన భారతీయ-అమెరికన్లతో బైడెన్ సమావేశం నిర్వహించనున్నారు. కాగా, అధ్యక్ష హోదాలో బైడెన్‌కు ఇదే చివరి దీపావళి రిసెప్షన్.