AP: లడ్డూ వ్యవహారంపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తిరుమల లడ్డూను సీఎం చంద్రాబాబు వివాదం చేశారని.. ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం భవ్యం కాదని, తాము చెప్పిన విషయాలతో సుప్రీం ఏకీభవించినట్టుందని పేర్కొన్నారు.