TG: పంట బీమా పథకం ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో పర్యటించిన తుమ్మల, కోమటి రెడ్డిలు నిడమనూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయని, రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండించేది నల్లగొండ జిల్లానేనని తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని కోమటిరెడ్డి వెల్లడించారు.