TG: హైదరాబాద్లోని మూసీ నది ప్రక్షాళన పనులు రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ సుందరీకరణకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించనున్నట్లు వెల్లడించారు. మూసీ ప్రాంతాల్లో పర్యాటక, పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.