రాగి పాత్రలో నీటిని నిల్వ చేస్తే అందులోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో రాగి పాత్రల్లోని నీరు తాగితే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. శరీర బరువు అదుపులో ఉంటుంది. అయితే రోజంతా రాగి పాత్రల్లోని నీటిని తాగటం శ్రేయస్కరం కాదు.