గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని దక్షిణ ప్రాంతంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిలో 11 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో హమాస్ పబ్లిక్ వర్క్స్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మజీద్ సలీహ్ కూడా ఉన్నారు.